భార‌త్ కు ర‌ష్యా క్షిప‌ణులు.. ఆందోళనలో అమెరికా

missileరష్యా నుంచి అత్యాధునిక S-400 బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలన్న భారత్‌  ఆలోచనపై ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నిర్ణయం అమెరికా-భారత్‌ దేశాల మధ్య సైనిక సహకారంపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని US హౌజ్‌ ఆర్మ్‌డ్‌‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌ విలియమ్‌ థోర్న్‌బెర్రీ తెలిపారు. S-400ల కొనుగోలుకు భారత ప్రయత్నాలపై వివిధ స్థాయిల్లో ‌తమ ఆందోళనలను వ్యక్తపరుస్తామని ఆయ‌న అన్నారు.

భారత్‌ రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంతో కీలకమైన టెక్నాలజీలను భారత్‌కు అమెరికా అందించలేదని చెప్పారు.  రష్యా నుంచి వీటిని భారత్‌ కొనుగోలు చేస్తే US నుంచి భారత్‌ కొనుగోలు చేసే ప్రిడేటర్‌ డ్రోన్ల  అగ్రిమెంట్ పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపారు.

క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా నుంచి పొందేందుకు భారత్ ‌39 వేల కోట్ల రూపాయలు అంచనాతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

Posted in Uncategorized

Latest Updates