భిన్నత్వం భారత బలం : ప్రణబ్ ముఖర్జీ

pranabభిన్నత్వం భారత బలమన్నారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. గురువారం (జూన్-7) నాగ్ పూర్ లోని RSS ప్రధాన కార్యలయంలో తృతీయ శిక్షా వర్గ్ కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడారు. ప్రతీ ఒక్కరి అభిప్రాయాలను అంతా గౌరవించాలన్నారు. భిన్నత్వం, వైవిధ్యమే మనను ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టిందన్నారు ప్రణబ్. దేశంలో ఉన్నవారెవరూ తమకు పరాయివారు కాదని… RSS అలాంటి బేధభావం చూపించదన్నారు RSS సర్ సంఘ్ ఛాలక్ మోహన్ భగవత్.

సమాజాన్ని సంఘటితం చేసేందుకే RSS పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ రావడంపై జరిగిన చర్చ అర్థరహితమన్నారు మోహన్ భగవత్. అంతకుముందు హెడ్గేవార్ స్మారకం సందర్శించిన ప్రణబ్.. ఆయన జాతి ముద్దు బిడ్డ అని సందర్శకుల పుస్తకంలో రాశారు.

Posted in Uncategorized

Latest Updates