భిలాయి స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు: 9 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లోని గ్యాస్ పైప్‌లైన్ పేలిపోయి 9మంది చనిపోగా… మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్‌లోని కోక్ ఒవెన్ సెక్షన్ సమీపంలోని పైప్‌లైన్‌లో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా గాయపడిన వాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 9 మంది మంటల్లో పూర్తిగా కాలిపోయారని, గాయపడిన 11 మందిలోనూ చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని దుర్గ్ రేంజ్ ఐజీ జీపీ సింగ్ తెలిపారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్‌ను జాతీయ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నిర్వహిస్తోంది.

2014లోనూ ఫర్నేస్‌లో సంభవించిన పేలుడు ధాటికి ఇదే స్టీల్ ప్లాంట్‌లో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా ఆరుగురు మృతి చెందారు. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్స్ కంటే భిలాయిలోనే ప్రపంచస్థాయి అత్యుత్తమ స్టీల్ తయారవుతోందని సెయిల్ చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates