భీమా కొరేగావ్ కేసు : ఐదుగురి గృహనిర్భంధాన్ని పొడగించిన సుప్రీం

భీమా కొరేగావ్ హింస కేసులో ఐదుగురి గృహనిర్భంధాన్ని నాలుగు వారాలు పొడగించింది సుప్రీంకోర్టు. దీనిపై సిట్ ను ఏర్పాటు చేసేందుకు మాత్రం సుప్రీం నిరాకరించింది. మహారాష్ట్ర పోలీసులు విచారణ జరిపేందుకు సుప్రీం అనుమతించింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2:1 తేడాతో ఐదురుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్భంధాన్ని పొడిగిస్తున్నట్లు ఇవాళ(సెప్టెంబర్-28)  సృష్టం చేసింది. ఈ కేసుని రాజకీయ కోణంలో చూడవద్దని ఈ సందర్భంగా కోర్టు సృష్టం చేసింది.

ఐదుగురు హక్కుల కార్యకర్తలు… వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గాన్ సాల్వెస్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలక లు ఆగస్టు-29 నుంచి గృహ నిర్భంధంలో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates