భీమా కొరేగావ్ కేసు : మోడీని చంపేందుకు ప్లాన్ చేశారన్న ఫడ్నవీస్

భీమా-కొరేగావ్ హింస కేసులో సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. నక్సల్స్‌ ను వాడుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీనిని చంపేందుకు… దేశంలో అంతర్యుద్ధానికి పౌరహక్కుల నేతలు ప్రయత్నించారని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు చెప్పడం మహారాష్ట్ర పోలీసులతో పాటు దేశ విజయంగా అభివర్ణించారు ఫడ్నవీస్. ఎన్నో ఏళ్లుగా పౌర హక్కుల నేతలుగా చెప్పుకుంటున్న వాళ్లు దేశంలో పౌర యుద్ధానికి ప్లాన్ చేస్తున్నారని….అయితే ఇప్పటి వరకూ వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదని ఫడ్నవీస్ తెలిపారు. దీని వల్ల దర్యాప్తు అసంపూర్తిగానే మిగిలిపోతూ వచ్చిందని తెలిపారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఇంతవరకూ సేకరించిన సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు ముందుకు తీసుకువెళ్తామని ఫడ్నవీస్ తెలిపారు.

పౌరహక్కుల నేతలు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సాల్స్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలక్‌ ల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఇవాళ(సెప్టెంబర్-28) మరో నాలుగు వారాలు పెంచింది.

Posted in Uncategorized

Latest Updates