భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుల ఫోటోలు విడుదల

BHIMభీమా కోరేగావ్ అల్లర్ల కేసులో పురోగతి వచ్చింది. నలుగురు నిందితుల ఫొటోలను పుణె జిల్లా రూరల్ పోలీసులు విడుదల చేశారు. జనవరి 1న భీమా కోరేగావ్ లో జరిగిన హింసలో రాహుల్ ఫతంగలే అనే యువకుడు చనిపోయాడు. ఆ నలుగురు నిందితులే రాహుల్ ఫతంగలేను కొట్టి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి చేతిలో కర్రలు, రాళ్లు ఉండడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నిందితులు ఎవరికైనా కనిపిస్తే లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పుణె జిల్లా పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి ఐదుగురిని పూణే పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates