భువనగిరిలో కారు ప్రమాదం..మహిళ మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా , భువనగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. సోమవారం (జూలై-30) భువనగిరి బైపాస్ రోడ్డు లోని డాల్ఫిన్ హోటల్ వద్ద కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూర్ చెందిన కారంపూడి గాయత్రి (32)గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మృతురాలు శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు రాఘవచార్యులు చిన్న కుమార్తె.

Posted in Uncategorized

Latest Updates