భువనేశ్వర్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం

భువనేశ్వర్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఆదివారం ఒడిశా వెళ్లారు సీఎం కేసీఆర్. భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఆ రాష్ట్ర అధికారులు, ఒడిశాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై నవీన్ తో ఆయన చర్చించనున్నారు.  రాష్ట్రాల హక్కులు హరించేలా ఉన్న  కేంద్రం విధానాలు, కాంగ్రెస్, బీజేపీ తీరును నవీన్ కు వివరించనున్నారు కేసీఆర్. రాత్రికి ఒడిశా ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే బస చేయనున్నారు టీఆర్ఎస్ చీఫ్.

రేపు ఉదయం రోడ్డు మార్గంలో వెళ్లి కోణార్క్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు కేసీఆర్. మధ్యాహ్నం కోల్ కతా వెళ్లనున్న కేసీఆర్.. సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. బీజేపీ,కాంగ్రెస్  వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుపై ఆమెతో చర్చిస్తారు గులాబీ బాస్. ఆక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారు. డిసెంబర్- 25వ తేదీ నుంచి రెండు, మూడు రోజులపాటు హస్తినలోనే  ఉంటారు కేసీఆర్. యూపీ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ తో సమావేశం అవుతారు. ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తోనూ భేటీ అవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates