భూగర్భంలోనే మేఘాలయ కార్మికులు : ప్రభుత్వంపై విమర్శలు

మేఘాలయ గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 13న గని లోపలికి వెళ్లిన 20 మంది కార్మికుల్లో 15 మంది లోపలే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా అడుగు ముందుకు పడడంలేదు. 370 అడుగుల లోతుకు వెళ్లి బొగ్గు తవ్వకాలు చేస్తున్నప్పుడు లైతే నది నుంచి నీరు ఒక్కసారిగా గనిలోకి వచ్చింది. దీంతో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మిగితా 15 మంది లోపలే చిక్కుకుపోయారు.

గనిలోని నీటిని ఎన్డీఆర్ఎఫె సిబ్బంది కొన్ని రోజులుగా తోడుతున్నారు. అయినా నీటి మట్టం తగ్గడం లేదు. మైనింగ్ మాఫియా భయంతో స్థానికులు NDRF సిబ్బందికి సహకారం అందించడం లేదు. తాజాగా భువనేశ్వర్ నుంచి ఎయిర్ ఫోర్స్ సీ – 130 J విమానంలో NDRF సిబ్బంది, యంత్ర సామాగ్రిని తీసుకుని బయల్దేరింది. ఇందులో ఒడిశా ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు.

బొగ్గుగనిలోకి ప్రవేశించినవారిని రక్షించడానికి రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థాయ్‌లాండ్‌ లాంటి చిన్నదేశంలో అతిక్లిష్టమైన గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ టీమ్ మెంబర్స్ ను ..ఆ దేశం విజయవంతంగా ప్రాణాలతో రక్షించగలిగింది. ఆ దేశంతో పోలిస్తే అన్నివిధాలా ఎంతో అభివృద్ధి చెందిన మనదేశంలో మాత్రం.. గని కార్మికులను రక్షించుకోలేకపోతున్నామని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కార్మికుల కుటుంబ సభ్యులు మాత్రం తమ వారు బతికే ఉంటారన్న ఆశలు వదులుకుంటున్నారు. ఇప్పటికే 15 రోజులవడంతో లోపల ఏం జరిగి ఉంటుందోనన్న ఆందోళనతో ఉన్నారు. థాయ్ లాండ్ గుహలో పిల్లలు చిక్కుకున్న ఘటనలో అంతా ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే ఇక్కడా కార్మికులు బయటకు రావాలని స్థానికులు కోరుకుంటున్నారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates