భూటాన్ కు భారత్ రూ.4500 కోట్ల సాయం

 ఢిల్లీ : భూటాన్ కు రూ.4500 కోట్ల ఆర్థిక సాయాన్ని భారత్ ప్రకటించింది. ప్రస్తుతం భూటాన్ ప్రధాని లోటే సెరింగ్ భారత పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఫ్రధాని మోడీని సెరింగ్ కలువగా భూటాన్ కు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల విషయంలో భూటాన్ సహకారం కీలకమైందన్నారు మోడీ. మంగడేచ్చుప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేయనున్నట్టు చెప్పారు. భూటాన్ ప్రభుత్వం త్వరలో రూపే  కార్డులు ప్రారంభించబోతోందని మోడీ అన్నారు. భారత్ సహాయానికి భూటాన్ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు వచ్చారు భూటాన్ ప్రధాని లోటే సెరింగ్. ఢిల్లీలో బిజీగా గడిపిన ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, సురేష్ ప్రభు, రాజ్ కుమార్ సింగ్ తో సమావేశమయ్యారు.  ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై చర్చించారు.

Posted in Uncategorized

Latest Updates