భూపంపిణీ పథకాన్ని ఆపే ప్రసక్తేలేదు : జగదీశ్ రెడ్డి

దళితులకు ఇచ్చే 3 ఎకరాల భూపంపిణీలో అనుకున్న స్థాయిలో ఫలితాలు లేవన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులు భూములు అమ్మితే కొని… దళితులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూపంపిణీ పథకాన్ని ఆపే ప్రసక్తేలేదన్నారు మంత్రి. చీకట్ల నుంచి మిగుల విద్యుత్ సాధించే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు జగదీశ్ రెడ్డి.
ప్రభుత్వానికి భారమైనా దళితులకు మూడేకరాల భూమి ఇచ్చేందుకు వెనకాడబోమన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. సెక్రటేరియట్ లో ఎస్సీ నోడల్ ఏజెన్సీ తో సమావేశమైన మంత్రి జగదీశ్ రెడ్డి… పలు శాఖల అభివృద్ధిపై చర్చించేందుకు ప్రతీ మూన్నేళ్లకోసారి సమావేశం కావాలన్నారు. దళితులకు మూడేకరాల భూ పంపిణీ అనుకున్నంత వేగంగా జరగటం లేదన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఆ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. భూములు అమ్మేందుకు రైతులు ముందుకు రాకపోవటంతో ఇబ్బంది అవుతుందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగినా.. ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్రం ఏర్పడేనాటికి విద్యుత్ డిమాండ్ 6వేల 600 మెగావాట్ల ఉంటే… నాలుగేళ్లలో 10వేల మెగావాట్లకుపైగా పెరిగిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 3వేల 5వందల కంపెనీలు రాష్ట్రానికి రాగా.. 15వందల కంపెనీలు పనులు మొదలుపెట్టాయని చెప్పారు జగదీశ్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates