భూపాలపల్లి గిరిజనుల కేసులు ఎత్తివేయాలి : గద్దర్

GADDERఈ ఏడాదిని ఓట్ల విప్లవ సంవత్సరంగా చెప్పారు ప్రజాగాయకుడు గద్దర్. రైతుబంధు లబ్ధిదారుల్లో అసలైన రైతు ఎవరో సర్కారే చెప్పాలన్నారు. రాష్ట్రంలో భూములుండి… విదేశాల్లో ఉన్నవాళ్లను కూడా రైతులుగా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లా గడ్డిపల్లిలో గిరిజనులపై దాడిని ఖండించారు. దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. బుధవారం (జూన్-6) కరీంనగర్ జిల్లా మానకొండూరులో పర్యటించిన గద్దర్.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్, టీమాస్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates