భూమిని కాపాడుకుందాం : తెలంగాణ మొత్తం ప్లాస్టిక్ నిషేధం

plasticప్లాస్టిక్ వాడకం నుంచి ప్రజలను దూరం చేయటంతోపాటు.. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ పై నిషేధం విధించటానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ GHMC పరిధిలో ప్లాస్టిక్ తయారీ, విక్రయాలు, వినియోగంపై నిషేధం అమలు అవుతుండగా.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లోనూ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో ప్లాస్టిక్ నిషేదం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ప్లాస్టిక్ తో తయారు చేసిన టీ కప్స్, వాటర్ గ్లాస్ లు, ఫుడ్ ప్లేట్స్, డిస్పోస్, కవర్స్ వస్తువులనూ బ్యాన్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై  జూన్ 13వ తేదీన.. అన్ని జిల్లాల అర్బన్ డెవలప్ మెంట్, మున్సిపల్ కమిషనర్స్ తో సమావేశం నిర్వహించి చర్చించారు పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్.

అర్బన్ డెవలప్ మెంట్ లోని సిటీల్లో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని గైడెన్స్ ఇచ్చారు. 50 మైక్రాన్లకు తక్కువ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కప్పులు, స్ట్రాలు వినియోగించవద్దన్నారు. ప్రతి కార్యాలయంలో విధిగా రెండు చెత్త డబ్బాల వాడకం అమలు చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి అన్ని స్థాయిల్లోనూ పూర్తి స్థాయిలో అవగాహనా చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించే చర్యలకు సంబంధించిన ఫొటోలను వాట్సప్ గ్రూప్‌ లో పెట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు లెటర్ రాసినట్లు తెలిపారు.

ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను ముందుగా నిషేధించనున్నారు. (డిస్పోజబుల్ ఐటమ్స్ – టీ కప్పులు, వాటర్ గ్లాసులు, ఐస్ క్రీమ్ కప్పులు, స్వీట్స్ షాపుల్లో ఉపయోగించే ప్లాస్టిక్ ఐటమ్స్) రాష్ట్రవ్యాప్తంగా వీటిని తయారు చేసే ఫ్యాక్టరీలపైనా చర్యలు తీసుకోనున్నారు. మళ్లీ మళ్లీ ఉపయోగించే ప్లాస్టిక్ ఐటమ్స్, ఎక్కువ రోజులు ఉపయోగించే ఐటమ్స్ ను మాత్రమే తయారు చేసే విధంగా వాళ్లకు అవగాహన కల్పించనున్నారు. ఇక 50 మైక్రాన్ల కంటే తక్కువ నాణ్యత ఉన్న ప్లాస్టిక్ అమ్మకాలపైనా కేసులు పెట్టనున్నారు. వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్లాస్టిక్ రహిత తెలంగాణలో భాగం కావాలని పిలుపునిస్తోంది ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates