భూరికార్డుల ప్రక్షాళన జరిగింది తెలంగాణలోనే: సీఎం కేసీఆర్

kcr-2తెలంగాణ రాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన జరగలేదన్నారు సీఎం కేసీఆర్. రాజేంద్రనగర్‌లో జరిగినరైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో కేసీఆర్‌ మాట్లాడారు. గుజరాత్‌లో ఆరేళ్ల క్రితం భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. తెలంగాణలో భూరికార్డుల ప్రక్షాళనను రెవెన్యూ అధికారులు 100 రోజుల్లో పూర్తి చేశారన్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేసిన రెవెన్యూ అధికారులకు అభినందనలు తెలిపారు. అంకాపూర్‌ను మించి తెలంగాణలోని అన్ని గ్రామాలను తీర్చిదిద్దుదామని సీఎం కేసీఆర్‌ రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సమన్వయ సమితి సభ్యులకు చూపించాలన్నారు.

రైతుల చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం భారత దేశంలో ఇప్పటి వరకే ఏదీ లేదని తెలిపారు. రైతులందరికీ అద్భుతమైన శిక్షణ ఇస్తామన్నారు. వచ్చే వర్షాకాలపు పంట ఒక్క గింజ కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్మనివ్వొద్దని సూచించారు. తేమశాతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మే నెల నుంచి రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు అందజేయనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates