భూసేకరణపై రగడ : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు అడ్డంకులు

bulletభారత్-జపాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చిక్కుల్లో పడింది. గుజరాత్, మహారాష్ట్రాల ప్రజలు భూములు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వాలు నిర్ణయించిన నష్ట పరిహారం ప్యాకేజీకి ఒప్పుకోకపోవడం ఇప్పుడు ప్రాజెక్టుకు పెద్ద సమస్యగా మారింది. ఏదైనా కారణాలతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైతే 2023 డెడ్ లైన్ చేరుకోలేం అంటున్నారు ముంబైలోని జపనీస్ కౌన్సిల్ జనరల్ నొడా. అహ్మదాబ్ లో జరుగుతున్న టూరిజమ్ ఫెస్టివల్ లో పాల్గొన్న అతను ఈ వ్యాఖ్యలు చేశారు.

2023 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు.. అది జరగాలంటే ఇంకా ఐదేళ్ల సమయం మాత్రమే ఉంది.. వెంటనే భూమి సమస్య పరిష్కరించాలని కోరారు. భారత ప్రభుత్వం రైతులతో మాట్లాడి.. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి, అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని జపాన్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 1.08 లక్షల కోట్ల ఈ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ తో కలిసి 88 వేల కోట్ల ఆర్ధికసాయం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం లోన్ ఇస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంబై-అహ్మదాబాద్ మధ్య జర్నీ.. రెండు గంటలు మాత్రమే ఉంటుందన్నారు.

ఇటీవల మహారాష్ట్రలోని థానేలో రైతులు తమ భూమిని ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆందోళన చేశారు. రైతులను భయపెట్టి, అరెస్ట్ చేసి థానే జిల్లా అధికారులు ల్యాండ్ సర్వే చేశారని.. దానిని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates