భూ వివాదాలు పరిష్కరిస్తాం : మంత్రి కేటీఆర్

 

ktr2 ఎల్బీనగర్ నియోజకవర్గంలోని భూ వివాదాలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత శాఖ అధికారులు, రెసిడెన్షియల్ కాలనీల ప్రముఖులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మేయర్ బొంతు రామ్మోహన్, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates