మంచం కిందే బాంబు పెట్టి చంపేశారు

258నల్గొండ జిల్లాలో దారణం జరిగింది. నిద్రిస్తున్న మంచం కింద నాటు బాంబు పేలి ఓ వ్యక్తి చనిపోయాడు. సాగర్ తిరుమలగిరి మండలం నాగార్జునపేటలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. చింతలపాలెం కాంగ్రెస్‌ ఉప సర్పంచ్‌ ధర్మానాయక్ మంచం కింద ప్రత్యర్థులు నాటుబాంబు పేల్చడంతో ధర్మానాయక్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్ధంకాక ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయారు. ప్రస్తుతం ఈ గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

Posted in Uncategorized

Latest Updates