మంచి దేవుడా మాకన్నా దొరకలేదే : చెత్త బుట్టలో 2.8 కేజీల బంగారం

golడస్ట్ బిన్ లో2.8 కేజీల బంగారాన్ని వదిలేసివెళ్లిపోయాడు  ఓ అజ్ణాతవ్యక్తి. బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జరిగింది ఈ సంఘటన.

జులై-4న ఎయిర్ పోర్ట్ టాయిలెట్ లోని  డస్ట్ బిన్ లో ఓ పాలిథిన్ బ్యాగ్ ను గుర్తించాడు ఎయిర్ పోర్ట్ హౌస్ కీపింగ్ ఉద్యోగి. దీంతో విషయాన్ని కస్టమ్స్ అధికారులకు తెలియజేశాడు. దీంతో అక్కడి చేరుకున్న అధికారులు కవర్ ను తెరిచి చూశారు. కవర్ ను తెరిచి చూడగానే అధికారులు ఆశ్యర్యపోయారు. కవర్ లో ఏమైనా పేలుడు పదార్ధాలు ఉంటాయేమోనని భావించిన అధికారులు అందులో 2.8 కేజీల బంగారాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ బంగారం విలువ 85 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

బంగారాన్ని అక్రమంగా తరలించే క్రమంలో ఎయిర్ పోర్ట్ లో చెకింగ్స్ ఎక్కువగా ఉండటంతో బయటకు తీసుకెళ్లలేక బంగారాన్ని టాయిలెట్ లోని డస్ట్ బిన్ లో పడేసి వెళ్లి ఉండవచ్చని, ఉదయాన్నే వచ్చిన ఇండిగో విమానం నుంచి దిగిన వ్యక్తే ఈ పని చేసినట్లు కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. బంగారాన్ని డస్ట్ బిన్ లో వదిలివెళ్లిన నిందితుడి కోసం సీసీ పుటేజిని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే డస్ట్ బిన్ లో ఇంత బంగారం దొరికందనే సమాచారం అందటంతో కొంతమంది… మాకిచ్చినా బాగుండు అనవసరంగా చెత్తబుట్టలో పారేశాడు భాధపడిపోతున్నారు. ఈ బంగారం కనుక దేవుడు మా కంటే పడేట్లు చేసి ఉంటే బాగుండు ఎలాగోలా ఎయిర్ పోర్ట్ దాటించి లక్షాధికారులం అయిపోయేవాళ్లమని కొంతమంది దేవున్ని తలుచుకుని భాధపడిపోతున్నారు.

.

 

Posted in Uncategorized

Latest Updates