వావ్..! కేదార్ నాథ్ ను మంచు కప్పేసింది

కేదార్ నాథ్ ఆలయం మంచుతో కప్పబడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయం ప్రతీ సంవత్సరం 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది.. ప్రస్తుతం చలికాలం కావడంతో    దాదాపు మంచుతో మూసుకుపోయింది. ఈ కాలంలో అక్కడికి వెళ్లడం కూడా నిషేధం. ఇందుకుగాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం చర్యలు చేపడుతుంది. ఆలయానికి ఎవరూ వెళ్లకుండా కొండ దిగువనే పోలీసులు గస్తీ కాస్తారు. దీపావళి తరువాత శివార్చన చేసి ఈ ఆలయాన్ని 6 నెలలకు గాను మూసివేస్తారు. ప్రస్తుతం అక్కడి ప్రదేశం మొత్తం మంచుతో కప్పబడి ఉంది.

Posted in Uncategorized

Latest Updates