మంచు పర్వతంపై మనోళ్లు

హయత్‌ నగర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలో చదువుతున్న మహేశ్వరిది ఆదిలాబాద్‌ జిల్లా. ఆమెతో పాటు మరికొంత మంది విద్యార్థినులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నవారే. రాష్ట్రవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు ఈ పర్వతారోహణలో పాల్గొన్నారు. వీరంతా నిరుపేద, గిరిజన కుటుంబాలవారే. నలుగురు బాలికలు, ఎనిమిది మంది బాలురతో కూడిన బృందం శుక్రవారం సిక్కిం సమీపంలోని 18,200 అడుగుల ఎత్తున్న పర్వాతాన్ని అధిరోహించింది. ఈ ఘనత సాధించిన విద్యార్థులను ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ సెక్రెటరీ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అభినందించారు.

‘‘కాలేజీకి వెళ్తానని.. పర్వతారోహకురాలిగా మారుతానని కలలో కూడా అనుకోలేదు. నా జీవితం బాల్య వివాహంతోనే ముగుస్తుం దనుకున్నా. కానీ ఇప్పుడు గర్వం గా ఉంది. హిమాలయాల్లోని లాకో ఖాంగ్‌ సే పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగరేయడం సంతోషంగా ఉంది’’ అని కన్నీటిని తుడుచుకుంటూ తన మనోభావాన్ని తెలిపింది మహేశ్వరి.

Posted in Uncategorized

Latest Updates