మంచు బరస్ట్ అయ్యింది : ‘మా’ని భ్రష్ఠు పట్టించారు

manchu-vishnuశ్రీరెడ్డి వ్యవహారం క్లయిమాక్స్ కు చేరుకుంది అనుకుంటున్న టైంలో.. మంచు ఫ్యామిలీ భరస్ట్ అయ్యింది. 10 రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ శ్రీరెడ్డి విషయంలో వ్యవహరించిన తీరుపై ఇప్పుడు మంచు విష్ణు స్పందించారు. శ్రీరెడ్డిపై ఏ అధికారం, హక్కుతో ఆంక్షలు విధించారని.. ఎవర్ని అడిగి ఎత్తివేశారని.. అసలు అసోసియేషన్ కు ఆ అధికారం ఉందా అని అసోసియేషన్ సభ్యులను నిలదీశారు. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజాకి లేఖ రాశారు.

సభ్యత్వమే లేని శ్రీరెడ్డిపై ఎలా ఆంక్షలు పెట్టారని నిలదీశారు. 900 మంది సభ్యులు నటిస్తే.. వారిని కూడా బహిష్కరిస్తాం అని హెచ్చరించారు.. ఆ 900 మంది సభ్యుల్లో మా డాడీ మోహన్ బాబు, నేను, నా తమ్ముడు, నా అక్క కూడా ఉన్నారు.. అసలు మమ్మల్ని అడిగే ఆ నిర్ణయం తీసుకున్నారా.. మమ్మల్ని కూడా కలిపే ఆ నిర్ణయం వెల్లడించారా అని నిలదీశారు. మీ చర్యలు, చేష్టలతో ప్రజల్లో, మీడియాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చులకన అయ్యిందని.. ఇంకా భ్రష్టు పట్టించొద్దు అని సూచిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. కాస్టింగ్ కౌచ్ తెలుగు సినీ ఇండస్ట్రీ పరువు తీస్తోందని.. వెంటనే అత్యవసర సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బాధ్యతను ఫిల్మ్ ఛాంబర్ తీసుకోవాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates