మంచు మయంగా కశ్మీర్..నిలిచిపోయిన ట్రాఫిక్

జమ్మూ : కశ్మీర్ లోయలోని మొఘల్ రోడ్డు మొత్తం మంచు మయంగా మారింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆరు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. మంచును ఎప్పటికప్పుడు తొలగించే పనిని అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. కశ్మీర్ లోయను జమ్మూతో కలిపే చారిత్రక రహదారి మొఘల్ రోడ్. ఇది 86 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సౌత్ కశ్మీర్ లోని షోపియాన్ ను రాజౌరీ, పూంఛ్ తో కలిపే ఈ రోడ్డులో.. వన్ వే లో మాత్రం వాహనాలను అనుమతిస్తున్నారు. మంచు కారణంగా రోడ్డంతా జారుడుగా మారింది. దీంతో జాగ్రత్తలు పాటించాలని వాహనదారులను అధికార యంత్రాంగం అలర్ట్ చేస్తోంది.

 

 

Posted in Uncategorized

Latest Updates