మండుతున్న ఎండలు : ఏపీలో స్కూల్స్ బంద్

school_childrenవానాకాలం వచ్చినా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మధ్నాహ్నం అయితే చాలు భగభగ మండుతున్నాయి. రుతుపవనాల లేటుగా వస్తాయని చెబుతున్నారు వాతావరణ అధికారులు.  దీంతో ఏపీలో స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం 3 రోజులు సెలవు ప్రకటించింది.

మంగళవారం జూన్‌ 19 నుంచి 21 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సోమవారం (జూన్-18) మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న వాతవరణ శాఖ సూచనల క్రమంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలు కూడా తప్పని సరిగా సెలువుల ఇవ్వాలని  స్పష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates