మంత్రివర్గ సమావేశం : కొత్త పథకాల ప్రారంభంపై చర్చ

శుక్రవారం (జూలై-27) మధ్యాహ్నం ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానున్న కంటి వెలుగు, రైతు బీమా పథకాలతోపాటు బీసీలకు వందశాతం సబ్సిడీ ఇచ్చే పథకాలపై సీఎం కేసీఆర్ మంత్రివర్గంతో చర్చించనున్నారు. ఈ నెలాఖరుతో గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవి కాలం ముగుస్తోంది. రాష్ట్రంలో గ్రామ పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 3 వేల 562 పంచాయితీలకు కార్యదర్శులున్నారు. మిగిలిన పంచాయితీల కోసం కార్యదర్శులను నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్, నియామకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. హరితహారం, రైతు బీమా, ఎల్బీనగర్ నుంచి అమీర్ పేట వరకు మెట్రో రైల్ ప్రారంభంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates