మంత్రి ఆదేశించినా అంతే : ఇంకా తెరుచుకోని 14 కంటోన్మెంట్ రోడ్లు

CONTONMENTరక్షణ పరమైన కారణంగా కొంతకాలంగా మూసి ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్లను ఓపెన్ చేయాలంటూ నెలరోజుల క్రితం రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించినప్పటికీ ఇంకా కొన్ని రోడ్లను ఓపెన్ చేయలేదు. మొత్తం 25 రోడ్లలో ఇప్పటివరకూ 11 రోడ్లను మాత్రమే అధికారులు ఓపెన్ చేశారు.

మరో 15 రోడ్లు ఓపెన్ చెయ్యాల్సి ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 4 లక్షల మంది ప్రజలు నివసిస్తుండగా.. చుట్టు ప్రక్కల ఏరియాల్లో 6 లక్షల మంది నివసిస్తున్నారు. దేశం మెత్తంలో 62 కంటోన్మెంట్లలో 850 రోడ్లు మూసివేసి ఉన్నాయని మంగళవారం రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో మూసిఉన్న రోడ్లను ఓపెన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్లను ఓపెన్ చేయడం ద్వారా వాహనదారుల సమయం ఆదా అవుతుందని తెలిపారు. కంటోన్మెంట్ రోడ్లు మూసివేయడం వల్ల చుట్టూ తిరిగి వెళ్సాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంటోన్మెంట్ రోడ్లు తెరవాలని స్థానిక రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే మంత్రి కేటీఆర్ సైతం కేంద్ర రక్షణ శాఖకు వినతిపత్రం ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి కూడా స్థానిక ప్రజలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఇటీవల రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆదేశించినా.. ఇంకా కొన్ని రోడ్లలో రాకపోకలకు అనుమతి ఇవ్వకపోవటంపై ఆందోళన వ్యక్తం అవుతుంది.

Posted in Uncategorized

Latest Updates