మంత్రి కేటీఆర్ రాకతో మున్సిపాలిటీ ఆదాయం పెరిగింది

మంత్రి కేటీఆర్ వచ్చాక మా వార్షిక ఆదాయం పెరిగిందన్నారు మున్సిపాలిటీ అధికారులు. ఒకప్పుడు నెలకు సరిగా జీతాలు కూడా రాని పరిస్థితి అన్నారు. హైదరాబాద్ హరిత ప్లాజాలో తెలంగాణ మున్సిపాలిటీ శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం(జూలై-25) విడుదల చేశారు. రూ.3వేల కోట్లతో 9 మున్సిపాలిటీలకు మంచి నీరు అందిస్తున్నట్లు తెలిపారు జలమండలి ఎండీ దానకిషోర్. మనుషుల ద్వారా మురుగును తొలగించకుండా 72 మినీ ఎయిర్‌టెక్ మిషన్‌లను తెచ్చామన్నారు. రూ.3వేల కోట్లతో ఔటర్ చుట్టు రింగ్ మేయిన్‌ను వేస్తున్నామని.. ఇందులో ఎప్పుడూ 20 TMCలు ఉండేట్లు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు.

మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు HMDA కమిషనర్ చిరంజీవులు. ఒకప్పుడు HMDA అంటే జీతాలు రావు అనేవారని… మంత్రి కేటీఆర్ వచ్చాక మా వార్షిక ఆదాయం రూ.13వేల కోట్లకు చేరిందన్నారు. 1.74 వేల LRSలను 18 నెలల్లోనే పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది పర్యావరణం కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నామన్నారు. లాండ్ పూలింగ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామన్నారు.

Posted in Uncategorized

Latest Updates