మంత్రి గారి పైత్యం : వానల కోసం కప్పలకు పెళ్లి

apaవరుణదేవుడు కరుణించి మంచిగా వర్షాలు కురిపించాలని రెండు కప్పలకు పెళ్లి చేశారు ఓ మంత్రి. పెద్ద సంఖ్యలో ఈ కప్పల పెళ్లిని చూడటానికి పెద్దఎత్తున ప్రజలు ఆలయం దగ్గరకు వచ్చారు. శుక్రవారం(జూన్-22) ఉదయం ఈ కప్పల వివాహం జరిగింది. అంతేకాకుండా కప్పల పెళ్లి తర్వాత విందు భోజనాలు కూడా పెట్టారు. మధ్యప్రదేశ్ లోని చత్తర్‌ పూర్‌ లోని ఓ గుడిలో ఈ కప్పల వివాహ కార్యక్రమాన్ని  జరిగింది.

వర్షాలు మంచిగా కురిసి రైతులు సంతోషంగా ఉండాలని మధ్యప్రదేశ్  రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లలితా యాదవ్ శుక్రవారం రెండు కప్పలకు వివాహం జరిపించారు. ఇతర బీజేపీ నాయకులతో కలిసి లలితా యాదవ్ అసద్ ఉత్సవ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా లలితా యాదవ్  పూజరి బ్రిజనందన్ ఆధ్వర్యంలో ఓ గుడిలో రెండు కప్పలకు పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పెళ్లిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఈ పెళ్లికి బ్యాండ్ బాజాలు కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత వింధుభోజనాలు కూడా పెట్టారు. పెద్ద పండుగలా ఈ కప్పల పెళ్లి  కార్యక్రమం జరిగింది. అయితే  ఆమె చేసిన పనని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. ఆ ఏరియాలో త్రాగునీటి సరఫరా చేయడం మానేసి ఇలాంటి కప్పల పెళ్లిళ్ల కార్యక్రమాన్ని జరిపించడంలో మంత్రి లలితా యాదవ్ బిజీగా ఉన్నారని చత్తర్ పూర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అలోక్ చతుర్వేది తెలిపారు. అయితే ఇది పురాతన కాలం నుంచి ఉన్న సంప్రదాయమని, ఇది నమ్మేవాళ్లల్లో మంత్రి కూడా ఒకరని, అంతేకాని ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని పూజారి బ్రిజనందన్ తెలిపారు. అయితే కప్పలకు పెళ్లి చేశారు సరే వాటికి శోభన కార్యక్రమం ఎప్పుడు జరిపిస్తారో చెప్పండంటూ నెటిజన్లు మంత్రిగారిపై సెటైర్లు వేస్తున్నారు. వాటిని హనీమూన్ కి ఊటీకి పంపిస్తారా లేక విదేశాలకు పంపిస్తారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates