మంత్రి జోగురామన్నకు తృటిలో తప్పిన ప్రమాదం

JOGUతృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న. మంచిర్యాలలో ఈ రోజు(ఫిబ్రవరి17) బీసీ సంక్షేమ హాస్టల్‌కు శంకుస్థాపన చేసేందుకు మంత్రి వచ్చారు. భూమిపూజ చేసిన తరువాత పక్కనే ఏర్పాటుచేసిన సభా వేదిక దగ్గరకు వెళ్లి మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు టపాసులు పేల్చారు. అయితే ఆ టపాసుల రవ్వలు టెంట్లపై పడడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో టెంట్ల కింద ఉన్న వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో మంత్రిని పక్కకు తీసుకెళ్ళడంతో ప్రాణాపాయం తప్పినట్లైంది.
firemancherial
firemancherial3

Posted in Uncategorized

Latest Updates