మంత్రి జోగు రామన్న చొరవతో… బాలికకు పునర్జన్మ

తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగురామన్న చొరవతో గుండె సంబంధితో వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికకు పునర్జన్మ లభించింది. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కు చెందిన ఆకాంక్ష(15) గుండె సంబంధత వ్యాధితో భాధపడుతుంది. కొంతకాలం క్రితం… ట్రీట్ మెంట్ కోసం ఆకాంక్షను తల్లిదండ్రులు గ్లోబల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆకాంక్షను పరీక్షించిన డాక్టర్లు… వెంటనే గుండె ఆపరేషన్ చేయాలని, అందుకు 22 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి జోగు రామన్న… సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే కేసీఆర్ ఆకాంక్ష గుండె ఆపరేషన్ కు అవసరమైన 20 లక్షలను మంజూరు చేసి తన ఉదారతను చాటుకున్నారు.

అపోలో హాస్పిటల్ లో బ్రెయిన్ డెడ్ అయిన కుమార్(21) గుండె ఉందని తెలుసుకున్న గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్లు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహకారంతో 11 నిమిషాల సమయంలో గుండెను అపోలో నుంచి గ్లోబల్ హాస్పిటల్ కు గుండె ను తరలించారు. వెంటనే ఆకాంక్షకు గుండె ను అమర్చి ప్రాణాలు కాపాడారు. ఆకాంక్ష ఆరోగ్య పరిస్ధితిని గురువారం(జులై-12) హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆకాంక్షను పరామర్శించిన వారిలో జోగురామన్న తో పాటుగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ఉన్నారు. అడిగిన వెంటనే స్పందించి… ట్రీట్ మెంట్ కు అవసరమైన డబ్బులిచ్చిన కేసీఆర్ కు కృతజ్ణతలు తెలిపారు జోగు రామన్న.

Posted in Uncategorized

Latest Updates