మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడిపై హెచ్ఆర్‌సీ లో ఫిర్యాదు

హైదరాబాద్ :  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ , మహబూబ్ నగర్ పోలీసులపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు కొంద‌రు వ్య‌క్తులు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి అండదండలతో భూకబ్జాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు , అక్రమంగా త‌మ‌పై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని బాధితుల ఆరోపిస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు… మహబూబ్ నగర్ డిఎస్పీ , సిఐ , ఎసైలు.. బీసీలమైన తమపై కేసులు పెడుతూ, జైళ్లకు పంపిస్తున్నారని కృష్ణ ముదిరాజ్ , గోనెల శ్రీనివాస్ తదితరులు హెచ్ఆర్‌సీ కి వివ‌రించారు. బాధితుల ఫిర్యాదు మేరకు , కేసును స్వీకరించిన హెచ్చార్సీ దర్యాప్తుకు ఆదేశించింది.మార్చి 15 లోపు ఈ విషయంపై విచారణ జరిపి , నివేదిక సమర్పించాలంటూ డీజీపీ కు ఆదేశాలు జారీ చేసింది.

Latest Updates