మందు బాబులే టార్గెట్: కార్ల బ్యాటరీలు, మొబైల్స్ చోరీ

ొ్ావపలు రకరకాల దొంగతనాలతో ప్రజలను భయాందోళనకు గురిచేసిన దొంగలు…తాజాగా కొత్త స్టైల్ ను ఎంచుకున్నారు. వైన్స్ ల‌ ముందు ఓపెన్ ప్ర‌దేశాల‌లో మ‌ద్యం సేవించిన‌ వాళ్ళ‌ను టార్గెట్ చేస్తున్నారు. ఫుల్ గా మందు కొట్టిన వారిని ఫాలో అవుతారు.మ‌త్తులో ఉన్న‌ వారి కార్ల‌ బ్యాట‌రీలు సెల్ ఫోన్ల‌ను ఎత్తుకెళ్తారు. మ‌త్తులో ఉండగా జ‌రిగిన‌ ఈ సంఘ‌ట‌న‌ల‌ గురించి చాలా మంది బయ‌ట‌ చెప్పుకోలేక‌…పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంలేదు. మందు బాబులను టార్గెట్ గా  చేసుకుని దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న‌ ఇద్ద‌రు నిందితుల‌ను కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ల‌క్షా 12 వేల‌ విలువైన‌ బ్యాట‌రీలు, సెల్ ఫోన్ ల‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు త‌ర‌లించారు.

హైదరాబాద్ బాలాన‌గ‌ర్ లో ఉండే మ‌హ్మ‌ద్ అమ్జ‌ద్ ఖాన్  బైక్ ల‌ను దొంగ‌తనాలు చేయడంతో పాటు.. ప‌లు నేరాల్లో జైలుకు వెళ్ళాడు. బోయిన్ ప‌ల్లి హ‌స్మ‌త్ పేట్ కు చెందిన‌ మహ్మ‌ద్ అక్రం కూడా ప‌లు నేరాల్లో జైలుకు వెళ్ళాడు.ఇద్ద‌రూ జైలులో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బెయిల్ పై విడుద‌లైన తర్వాత ఈజీ మ‌ని కోసం మందు కొట్టి  మ‌త్తులో తూగేవారిని టార్గెట్ చేశారు. సికింద్రాబాద్ కార్ఖానా లో ఓపెన్ ప్లేస్ లు…వైన్స్ ల‌ ముందు తాగే వారిని ఫాలో చేస్తారు..వారి కార్ల‌ బ్యానెట్ ఓపెన్ చేసి బ్యాట‌రీలు కాజేయడం…మ‌త్తులో ఉన్న‌ వారి చేతుల్లోంచి సెల్ ఫోన్ కొట్టేస్తారు. అయితే కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో వైన్స్ ల‌ ముందు నిఘా పెట్టిన‌ కార్ఖాన‌ పోలీసులు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా…అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. అమ్జద్, అక్రం లనుంచి 10 బ్యాట‌రీలు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు ఇద్ద‌రిని రిమాండ్ కు త‌ర‌లిస్తున్న‌ట్లు నార్త్ జోన్ డీసీపీ సుమ‌తి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates