మక్కా మసీదు పేలుళ్లపై తీర్పునిచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా

JUDGEమక్కా మసీదు పేలుళ్లపై తీర్పునిచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు . ఈ నిర్ణయం సంచలనంగా మారింది. తీర్పు ఇచ్చిన కాసేపటికే రవీందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను మెట్రో పాలిటన్ స్పెషల్ జడ్జికి పంపారు. రిజైన్ లెటర్ తో పాటు 15రోజుల పాటు తాత్కాలిక సెలవు అడిగినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు సమాచారం.
మక్కా పేలుళ్ల విషయంలో సరైన సాక్ష్యాధారాలు ప్రాసిక్యూషన్ ఇవ్వలేకపోయిందంటూ ఐదుగురిని నిర్ధోషులుగా ప్రకటించారు రవీందర్ రెడ్డి. ఈ తీర్పుపై అటు బీజేపీ, ఇటు ఎంఐఎం నాయకులు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో రవీందర్ రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates