మజిలీ టీజర్ : వెదవలకు మంచి పెళ్లాలే దొరుకుతారు

అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి పెళ్లి తర్వాత నటించిన సినిమా మజిలీ. లవర్స్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేసింది యూనిట్. టీజర్ చూస్తుంటే..వీరిద్దరి జోడీ మరోసారి ఏం మాయ చేశావే, మనం సినిమాలు గుర్తుకువస్తాయి. భర్త అంటే సమంతకు ఎంత ఇష్టమో టీజర్ లో చూపించారు.

నిమిషం 16 సెకన్లున్న టీజర్ లో..నా ఫ్యామిలీ జోలీకి రావద్దు అంటూ సమంత డైలాగ్ ఆకట్టుకోగా..నువ్వు నా రూమ్ లోపలికి రాగలవేమో గానీ ..నా మనసులోకి ఎప్పటికీ రాలేవని చైతు అంటాడు. వెదవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావని క్లైమాక్స్ లో పోసాని డైలాగ్ బాగుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పోస్టర్స్‌ ను విడుదల చేసిన యూనిట్.. లేటెస్ట్ గా టీజర్ ను రిలీజ్ చేయడంతో సినిమాపై మంచి అంచనాలే మొదలయ్యాయి. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్‌ సెకండ్ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. ‘నిన్నుకోరి’ ఫేం శివ డైరెక్టర్.  హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా తెర‌కెక్కిన ఈ మూవీలో.. నాగచైతన్య, సమంత పాత్రలు, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయ‌నున్నారు.

Latest Updates