మణిపూర్ లో భారీ వర్షాలు : కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

మణిపూర్ లో కొండ చరియలు విరిగిపడి 9మంది చనిపోయారు. బుధవారం (జూలై-11) తమెంగ్లాంగ్ జిల్లాలో మూడు చోట్ల విరిగిన పడిన కొండ చరియలు.. 9మంది ప్రాణాలు తీశాయి. ఇందులో 8మంది చిన్నారులు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. ఇందులో ఏడుగురి డెడ్ బాడీలను బయటికి తీశారు. మరో ఇద్దరి కోసం సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో రెండు కుటుంబాలు తమ తోబుట్టువులను కోల్పోయాయి. కొండచరియలు విరిగిపడటంతో కోహిమా, దిమపూర్ నేషనల్ హైవే 2పై ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్స్ రాకపోకలు ఆగిపోయాయి. అధికారులు విరిగిపడిన కొండ చర్యలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates