మణిరత్నం ఆఫీస్ కు బాంబు బెదిరింపు

చెన్నై : ప్రముఖ సినిమా దర్శకుడు మణిరత్నం ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై అభిరామపురంలోని ఆయన ఆఫీస్ కు ఫోన్ చేసి బెదిరించాడు ఓ అగంతకుడు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో విడుదలైన “చెక్క చివంత వానం” సినిమాలో వివాదాస్పద డైలాగులను తొలగించాలని అగంతకుడు డిమాండ్ చేసాడు. లేకపోతే.. మణిరత్నం ఆఫీసును బాంబు పెట్టి పేల్చేస్తామని హెచ్చరించాడు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ కు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు… భద్రతను కల్పించారు.

అరవింద స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్ గా తమిళంలో తెరకెక్కింది “చెక్క చివంత వానం”. ఈ సినిమా ఇటీవలే విడుదలై తమిళనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో నవాబ్ పేరుతో డబ్ అయింది. తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాలో ఏ డైలాగులను తొలగించాలని డిమాండ్ చేశాడన్న దానిపై క్లారిటీ రాలేదు.

న‌వాబ్ సినిమా.. గ్యాంగ్‌స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. చెన్నైని శాసించే ప్ర‌కాశ్ రాజ్ … మరణం తర్వాత.. ఆయన అధికారాన్ని దక్కించుకునేందుకు కొడుకులు పోటీ పడుతుంటారు. ఇది తమిళనాట రాజకీయాలకు దగ్గరగా ఉండటంతో… కొన్ని డైలాగులపై అగంతకులు అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు నడుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates