మతం పిచ్చి.. కన్న బిడ్డనే బలిచ్చాడు

MURDER CHILDదేశంలో మూఢ విశ్వాసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. బలి దానాల పేరుతో పసి ప్రాయంలోనే చిన్నారులను కడతేర్చుతున్నారు. మతాల పేర్లతో అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కన్న బిడ్డలనే హత్య చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మరోసారి కలకలం రేపింది.  రంజాన్ మాసంలో అల్లాను శాంతింపజే యాలని కుమార్తెను తండ్రి కత్తితో గొంతుకోసి కడతేర్చిన ఘటన రాజస్థాన్‌ లో జరిగింది.

శుక్రవారం (జూన్-8)న జరిగిన ఈ ఘటన ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది. పిపార్సిటి పట్టణ వాసి నవాబ్ అలీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం (జూన్-7) రాత్రి కుటుంబసభ్యులంతా ఇంటి మిద్దెపై నిద్రించారు. ఉదయం చూస్తే వారి పెద్ద కుమార్తె రిజ్వానా (4) ఇంటి కిందశవమై కనిపించింది. బిడ్డను పిల్లి ఎత్తుకెళ్లి చంపి ఉంటుందని కుటుంబాన్ని అలీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. అలీపై అనుమానంతో విచారించగా.. నేరం అంగీకరించాడని తెలిపారు. అల్లా ఆశీస్సుల కోసమే ఆమెను బలిచ్చినట్టు చెప్పాడన్నారు. గురువారం ఉదయం రిజ్వానాను అలీ మార్కెట్‌ కు తీసుకెళ్లి స్వీట్లు కొనిచ్చాడు. అర్ధరాత్రి దాటాక రిజ్వానాను కిందకు తీసుకొచ్చి ఒడిలో కూర్చోబెట్టుకొని, ఖురాన్‌ ను పఠించి కత్తితో గొంతుకోసి చంపి, ఆ తర్వాత ఎప్పటిలాగే మిద్దెపై కెళ్లి పడుకున్నాడని చెప్పారు పోలీసులు. ఈ మేరకు అలీని అరెస్టు చేసినట్టు తెలిపారు పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates