మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భారత్ బంద్

bharathమతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మంగళవారం (ఏప్రిల్-10) భారత్ బంద్‌ కు పిలుపునిచ్చాయి కొన్ని విద్యార్ధి, ప్రజా సంఘాలు. ఈ క్రమంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 144ను విధించారు. బీహార్‌లోని ఆర్రాలో ఆందోళనకారులు రైలును ఆపేశారు. దర్బంగాలో అలజడి సృష్టించారు. ఆందోళనలు నిర్వహించాలంటూ వాట్సాప్‌ లో మెసేజ్‌ లు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ బంద్ చేశారు.

SC, ST చట్టాన్నిసడలించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఏప్రిల్ 2వ తేదీ దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ బంద్ వల్ల చెలరేగిన హింసలో 10 మంది చనిపోయారు. అయితే ఇవాళ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్న క్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లోని బింద్, మోరీనా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. విద్యా, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లు వద్దంటూ బీహార్‌లో నిరసనకారులు ర్యాలీ తీశారు.

Posted in Uncategorized

Latest Updates