మత్తులోనే : ఆటోను ఢీకొట్టి ఐదుగురిని చంపింది.. ఆ కుర్రోళ్ల కారే

accidentరంగారెడ్డి జిల్లా మంచాల దగ్గర ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితున్ని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మంచాలకు చెందిన నలుగురు యువకులు ఓ పార్టీకి వెళ్ళి వస్తుండగా జరిగిన ఈ యాక్సిడెంట్… డ్రంకన్ డ్రైవ్ కండీషన్ లో జరిగిందని గుర్తించారు పోలీసులు. అందుకు కారణమైన ప్రవీణ్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కారు నడిపిన ఏ1 కోటేశ్వర్ రెడ్డి హాస్పిటల్ లో ఉండటంతో.. అతడ్ని అదుపులోకి తీసుకోలేదు. తాగిన మైకంలో కారు నడిపి ఐదుగురి మృతికి కారణమైన కోటేశ్వర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిలపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ప్రవీణ్ ను రిమాండ్ కి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates