మత్స్యకన్య పుట్టింది : క్షణాల్లోనే కన్నుమూత

beed
పురాణాల్లో చెప్పినట్లుగానే మత్స్యకన్యను పోలిన ఓ వింత శిశువు జన్మించింది. కానీ పట్టుమని పది నిమిషాలు కూడా ఆ పసిపాప ప్రాణాలతో లేదు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఆ శిశువుకు అందరికి ఉన్నట్లు తల, చేతులు మామూలుగానే ఉన్నాయి. కానీ రెండు కాళ్లు పూర్తిగా కలిసి పోవడంతో చేపకన్యలా ఉంది ఆ శిశువు. గర్భధారుణ సమయంలో ఆ శిశువు తల్లి ఎలాంటి మందులు వాడలేదటా…దీని కారణంగానే రెండు కాళ్లు కలసిపోయాయంటున్నారు డాక్టర్లు. పుట్టిన ఆ వింత శిశువు శరీరంలోని పై భాగం అవయవాలు పని చేశాయి. కానీ కిందిభాగం మొత్తం కలసిపోవడంతో  చేప ఆకారం కన్పించింది. పుట్టిన పది నిమిషాలకే ఆ శిశువు ప్రాణం పోయింది. వైద్య పరిభాషలో ఈ రుగ్మతను ‘’ సైరెనోమీలియా ‘’ అంటారని వైద్యులు చెపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates