మద్దతు కోసం చిన్న పార్టీలతో చర్చలు : ఆగస్టు 14లోపు ప్రధానిగా ఇమ్రాన్

ఓవైపు మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తూనే…ప్రధాని పీఠం ఎక్కేందుకు ముహూర్తం పెట్టుకున్నారు ఇమ్రాన్ ఖాన్. ఆగస్టు 14లోపు పగ్గాలు చేపట్టి..పాకిస్తాన్ జెండా ఎగరవేయాలని స్కెచ్ వేస్తోంది పీటీఐ. తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ .. పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఆగస్టు 14లోపు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన పీటీఐ..ఇతర చిన్న పార్టీలను కలుపుకొని సర్కార్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మా పని మేము చేస్తున్నామన్నారు ఆపార్టీ నేతలు.

ఫైనల్ ఫలితాలను ప్రకటించింది పాక్ ఎన్నికల కమిషన్ . పీటీఐ -115 సీట్లు, పాకిస్థాన్ ముస్లిం లీగ్-64 స్థానాలు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 43 స్థానాల్లో గెలిచింది. ముత్తాహిదా మజ్లిస్ ఐ అమల్ -12, ముత్తాహిదా క్వయుమి మూమెంట్ -ఆరు సీట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇతర సీట్లను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 137 మంది సభ్యులు ఉండాలి. పీటీఐకి మరో 22మంది సభ్యులు తక్కువగా ఉన్నారు. ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు ఇమ్రాన్ కు మద్దతు ప్రకటించాయి. ఆరు సీట్లు గెలిచిన MQM పార్టీతో పీటీఐ నేతలు చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పీటీఐని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు పాకిస్తాన్ అధ్యక్షుడు.

Posted in Uncategorized

Latest Updates