మద్దతు ధర ప్రకటించే దమ్ము ప్రధానికి లేదు : కేసీఆర్

kcr-modiకరీంనగర్ లో జరిగిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులో.. కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. రెండు అసమర్థ పార్టీల పాలన కారణంగానే రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని కోరితే ప్రధాని, కేంద్రమంత్రులు పట్టించుకోలేదని మండిపడ్డారు కేసీఆర్. దేశంలో రైతుల తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఒకవేళ అదే జరిగితే దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులు నాయకత్వం వహిస్తాయన్నారు.

కర్నాటక ఎన్నికలు ఉన్నాయని అందుకే బీజేపీ ప్రభుత్వం గోదావరి-కావేరి అనుసంధానమని డ్రామా మొదలుపెట్టిందన్నారు. రైతుల కోసం 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టలేరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ పోతే రాహుల్ వస్తాడు.. కానీ ఏం మారదన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించే దమ్ము ప్రధానికి లేదన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates