మద్యం మత్తులో… 6 ఏళ్ల చిన్నారిని దారుణంగా చంపేసిన తండ్రి

nandaynఅనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో వికలాంగురాలైన ఆరేళ్ల చిన్నారిని కన్నతండ్రే దారుణంగా కొట్టి చంపాడు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్‌ లో ఈ దారుణం జరిగింది.
వజక్రకరూర్ లో నివాసముంటున్న ఎర్రిస్వామికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సుమిత్ర(6) పుట్టుకతోనే వికలాంగురాలు. నడవలేనిదానివి నాకు ఎలా పుట్టావంటూ ప్రతిరోజూ ఎరిస్వామి సుమిత్రను తిడుతుండేవాడు. మద్యం త్రాగి వచ్చి చిన్నారిని నడవాలంటూ వేధించేవాడు. శనివారం(మే-26) రాత్రి కూడా మద్యం సేవించి చిన్నారిని నడవాలంటూ ఒత్తిడి చేశాడు. అయితే ఆ చిన్నారి నడవలేకపోవడంతో… బండ కేసి కొట్టి చిన్నారి సుమిత్రను దారుణంగా చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అభంశుభం తెలియని చిన్నారిని చంపాడానికి అతడికి మనస్సు ఎలా వచ్చిందో తెలియడం లేదని చిన్నారి మృతిపై గ్రామస్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వీడు మనిషే కాదంటూ చిన్నారి తండ్రిపై గ్రామస్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates