మధుమేహ నియంత్రణకు కొన్ని చిట్కాలు

*ప్రతి రోజూ పరగడుపున 5 గ్రాముల మెంతుల చూర్ణాన్ని, నీటితో తీసుకుంటే షుగర్‌ నిల్వలు నియంత్రణలో ఉంటాయి.

*రెండు భాగాల మెంతుల చూర్ణానికి, ఒక భాగం త్రిఫలా చూర్ణం కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 గ్రాముల మోతాదులో మాత్రలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు వేసుకుంటే షుగర్‌ నిల్వలు అదుపులోకి వస్తాయి.

*పసుపు, ఉసిరికాయ చూర్ణాన్ని సమ పాళ్లల్లో తీసుకుని, 5 గ్రాముల మోతాదులో మాత్రలు తయారు చేసుకుని, ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటే షుగర్‌ అదుపులోకి వస్తుంది.

*ప్రతి రోజూ ఉదయం పరడుపున ఓ 10 లేత వేపాకు చిగుర్లను నమిలి తినేస్తే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.

*ప్రతి రోజూ పరగడుపున అరగ్లాసు కాకరకాయ రసం సేవిస్తే రక్తంలోకి చక్కెర అదుపులో ఉంటుంది. కాకపోతే, మొదటి రోజూ అరగ్లాసు అనికాకుండా, ఒక్కొక్క స్పూనుతో వారానికి ఒక్కో స్పూను చొప్పున పెంచుకుంటూ పోవాలి.

Posted in Uncategorized

Latest Updates