మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి

accciమధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం(జూన్-21) ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 15మంది మృత్యువాతపడ్డారు. జీపును ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్వాలియర్‌ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 20 మంది జీపులో ఘుర్గాన్‌ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే సంతాప కార్యక్రమానికి వెళ్తున్నారు. వీరి వాహనాన్ని మొరెనా జిల్లా గంజ్‌రాంపూర్‌ గ్రామ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 12 మంది అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు మొరెనా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు. మిగతా ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు.

 

 

Posted in Uncategorized

Latest Updates