మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణం.. రుణమాఫీపై తొలిసంతకం

మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సీనియర్ నేత కమల్ నాథ్ రైతు రుణమాఫీ ఫైల్ పై తొలిసంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అందులో చెప్పిన అంశం ప్రకారంగానే ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కమల్ నాథ్ రుణమాఫీ పై సంతకం చేశారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల వరకు రుణమాఫీ కానుంది.

అంతకు ముందు కమల్ నాథ్ చేత మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. భోపాల్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు , డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామి సహా పలువురు విపక్ష నాయకులు హాజరయ్యారు.

 

Posted in Uncategorized

Latest Updates