మధ్యాహ్నం టీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాలు విడుదల

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ ప్రకటించనున్నారు. డిసెంబర్ లో ఎన్నికలు ఉండటంతో… ముందుగానే కీలకమైన ఎన్నికల హామీలను ప్రకటించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఎన్నికల ప్రణాళికలో ఖరారైన కొన్ని కీలక హామీలను కేసీఆర్ ఇవాళ ప్రకటిస్తారని తెలుస్తోంది.

మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరిగే ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. కమిటీ చైర్మన్ కేశవరావు సహా.. 15 మంది కమిటీ సభ్యులు కూడా మీటింగ్ కు వస్తారు.  ఆ తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడతారు. సీఎం ప్రగతి నివేదన సభలతో… నియోజకవర్గాల్లో నాయకులు ర్యాలీలతో.. ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గెలిచాక ఏం చేయబోతున్నారంటూ.. ప్రచారంలో జనం కోరుతున్నారని అధిష్టానానికి విన్నపాలు రావడంతో… కొన్ని కీలకమైన హామీలను ప్రకటించాలని డిసైడయ్యారు గులాబీ నేతలు.

పింఛన్ల పెంపు, ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వ ఆర్థిక సాయం, వర్గాల వారీగా కొత్త పథకాలు ప్రకటిస్తారని సమాచారం. ఈ హామీలను జనంలోకి తీసుకెళ్తూ.. పండుగ తర్వాత ప్రచారాన్ని స్పీడప్ చేయాలన్న ప్రణాళికలు వేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాలు ప్రకటించగానే రాష్ట్రమంతటా సంబురాలు జరపాలని కేడర్ కు ఆదేశాలు వెళ్లాయి.

Posted in Uncategorized

Latest Updates