మధ్యాహ్నం 3 గంటల వరకు 56.17శాతం పోలింగ్

 మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56.17శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈసారి ఓటర్లు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు లైన్లో ఉన్న అందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల ప్రధానాదికారి అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటువేయోచ్చని తెలిపారు. మరోవైపు రాజస్థాన్‌లో 3 గంటల వరకు 59.43శాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates