మధ్యాహ్నం 3.30 గంటల వరకు సభ వాయిదా

karnataka assembly కర్ణాటక అసెంబ్లీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ప్రోటెం స్పీకర్‌ బోపయ్య.  ఇప్పటి వరకు 207 మంది కొత్తగా ఎంపికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా వాళ్లు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్ష జరగనుంది. ఈ బలపరీక్షను టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపాను గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరినప్పటికీ గవర్నర్‌ బీజేపీకే అవకాశం ఇచ్చాడు. భాజపాకు సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో బలపరీక్షపై ఆసక్తి నెలకొంది.

Posted in Uncategorized

Latest Updates