మధ్య తరగతికి మోడీ బంపరాఫర్ : పెద్ద ఇళ్లు కొనుగోలు చేసినా వడ్డీ రాయితీ

modi-hawas-yojanaమధ్య తరగతి ప్రజలకు మోడీ శుభవార్త చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వడ్డీ రాయితీ పథకాన్ని మరింత విస్తరించారు. ఇప్పటి వరకు ఇళ్ల కొనుగోలులో విస్తీర్ణంపై ఉన్న పరిమితిని పెంచారు. మధ్య తరగతి వారు పెద్ద ఇల్లు కొనుగోలు చేసినా.. ఆవాస్ యోజన కింద వడ్డీ రాయితీ వర్తింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే లక్ష్యంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏడాదికి రూ.18లక్షల ఆదాయం ఉండి.. పెద్ద ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్న వారికి సైతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వడ్డీ రాయితీ పొందవచ్చు.

ప్రస్తుత నిబంధనలు ఇలా ఉన్నాయి :

  • రూ.6 నుంచి రూ.12 లక్షల ఆదాయం ఉండి.. 120 చదరపు మీటర్ల ప్లాట్ కొనుగోలు చేస్తే రూ.2.35లక్షల వడ్డీ రాయితీ
  • రూ.12 నుంచి రూ.18లక్షల ఆదాయం ఉండి.. 150 చదరపు మీటర్ల ప్లాట్ కొనుగోలుకు రూ.2.30 లక్షల వడ్డీ రాయితీ

సవరించిన.. విస్తరించిన నిబంధనలు ఇలా ఉన్నాయి :

  • రూ.6 నుంచి రూ.12 లక్షల ఆదాయం ఉండి.. 160 చదరపు మీటర్ల ప్లాట్ కొనుగోలు చేస్తే రూ.2.35లక్షల వడ్డీ రాయితీకి అర్హులు అవుతారు.
  • రూ.12 నుంచి రూ.18లక్షల ఆదాయం ఉండి.. 200 చదరపు మీటర్ల ప్లాట్ కొనుగోలు చేసినా.. రూ.2.30 లక్షల వడ్డీ రాయితీకి అర్హులు అవుతారు.

చిన్న, మధ్య తరహా పట్టణాల్లో అందరికీ సొంతిల్లు, గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates