మనది పవర్ ఫుల్ కాదు : శక్తి వంతమైన పాస్ పోర్టులు ఇవే

PAAAప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ల లిస్ట్ లో భారత్ 76వ స్ధానంలో నిలిచింది. 59 దేశాలకు వీసా-ఫ్రీ సదుపాయాన్ని కల్పిస్తూ భారతీయ పాస్ పోర్ట్ 76వ ప్లేస్ లో నిలిచింది. సిటిజన్ షిప్ ప్లానింగ్ సంస్ధ హెన్ లీ అండ్ పార్టనర్స్ యాన్యువల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. పాస్ పోర్ట్ హోల్డర్స్  వీసా పర్మీషన్ లేకుండా ఎన్ని దేశాలు వెళ్లవచ్చు లేదా వీసా లేకుండా ఇతర దేశాలు వెళ్లి అక్కడ వీసా పర్మిట్ పొందటం వంటి అంశాల ఆధారంగా ఈ సంస్ధ సర్వే చేసింది.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఫలితాలను సంస్ధ విడుదల చేసింది. దీని ప్రకారం.. వీసా అవసరం లేకుండా 189 దేశాల యాక్సెస్ తో జపాన్ పాస్ పోర్ట్ అత్యంత పవర్ పుల్ గా నిలిచింది. ఇక 188 దేశాల యాక్సస్ తో జర్మనీ, సింగపూర్ పాస్ పోర్ట్ లు సెకండ్ ప్లేస్ లో నిలిచాయి. 187 దేశాల యాక్సెస్ తో డెన్మార్క్, స్వీడన్, స్పెయిన్, సౌత్ కొరియా, ఇటలీ, ఫ్రాన్స్, ఫిన్ లాండ్ పాస్ పోర్టులు మూడో స్ధానంలో నిలిచాయి. ఇక 186 దేశాల యాక్సెస్ తో అగ్రరాజ్యం అమెరికా, ఆస్ట్రియా, యూకే, పోర్చుగల్, నార్వే, లక్సంబర్గ్, నెదర్లాండ్ నాలుగో ప్లేస్ లో నిలిచాయి. ఇక ఈ లిస్ట్ లో 59 దేశాల యాక్సెస్ తో భారతీయ పాస్ పోర్ట్  76వ స్థానంలో నిలిచింది.

 

Posted in Uncategorized

Latest Updates